టీమిండియా తదుపరి ప్రధాన కోచ్ ఎవరన్న దానిపై సస్పెన్స్ ఇంకా కొనసాగుతూనే ఉంది. కోచ్ పదవి కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్ధులను క్రికెట్ సలహా కమిటీ(సీఏసీ) సభ్యులు లక్ష్మణ్, గంగూలీ ముంబైలోని ప్రధాన కార్యాలయంలో సోమవారం ఇంటర్యూలు నిర్వహించారు.మొత్తం ఆరుగురు సీనియర్ క్రికెటర్లను సీఏసీ ఇంటర్వ్యూ చేసినట్టు తెలుస్తోంది.